PLD: ప్రపంచ దేశాలకు ఆదర్శం సనాతన ధర్మం అని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. హిమాలయ గురూజీ ఆధ్వర్యంలో వినుకొండ మండలంలోని విఠంరాజుపల్లి వద్ద శాంతి ఆశ్రమంలో మంగళవారం సకల సాంస్కృతిక కళాకారుల గురువుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హాజరయ్యారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మం ప్రపంచ దేశాలకు ఆదర్శమని అన్నారు.