AKP: రోలుగుంట పరిసర ప్రాంతాలలో రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని APEPDCL EE రామకృష్ణ తెలిపారు. చెట్టుపల్లి, కాముడుపాలెం, రోలుగుంట, స్టోన్ క్రషర్ ఏరియాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వ్యవసాయానికి త్రీఫేస్ కరెంట్ ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఉంటుందన్నారు.