గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్ కౌంటర్ చేసిన పోలీసుకు కర్ణిసేన భారీ బహుమానాన్ని ప్రకటించింది. బిష్ణోయ్‌ని ఎన్ కౌంటర్ చేస్తే రూ.కోటికి(రూ.1,11,11,111)పైగా నజరానా ఇస్తామని ఆఫర్ చేసింది. ఈ మేరకు కర్ణిసేన జాతీయాధ్యక్షుడు రాజ్ షెకావత్ అధికారికంగా ప్రకటించారు. ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యతో బిష్ణోయ్ గ్యాంగ్ ఇటీవల వార్తల్లో నిలిచింది.