AP: ఏ రంగంలోనైనా ఆత్మవిశ్వాసమే అసలైన ఆయుధమని సచిన్ టెండూల్కర్ అన్నారు. తాను క్రికెట్లో రాణించడానికి నెట్స్‌లో చేసిన నిరంతర సాధనే కారణమని వెల్లడించారు. ఒత్తిడిని జయించాలంటే పనిలో నిమగ్నం కావాలని, లక్ష్య సాధనలో అనుమానాలు వచ్చినా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు. సరైన మార్గంలో ఓర్పుతో సాగితేనే విజయం సాధ్యమని AU విద్యార్థులకు ఆయన సక్సెస్ సూత్రాలు చెప్పారు.