తెలుగు హీరో సందీప్ కిషన్‌కు ‘వివాహ భోజనంబు’ అనే రెస్టారెంట్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై సందీప్ కిషన్ ట్వీట్ చేశాడు. రెస్టారెంట్ టీమ్ పేదలకు ఫుడ్ పంపిణీ చేస్తున్న ఫొటోలను షేర్ చేస్తూ..’టీమ్ చేస్తున్న పనికి నేను గర్వపడుతున్నా. మీలో ఎవరైనా భోజనం కోసం కష్టపడితే మీ దగ్గర్లో ఉన్న ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్‌కి నేరుగా వెళ్లి ఫుడ్ ప్యాకెట్‌ని ఉచితంగా తీసుకోండి’ అంటూ పోస్టు పెట్టాడు.