MDK: మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మంగళవారం పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బైక్, సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ మున్సిపాలిటీ పరిధిలోని పలు వీధుల గుండా కొనసాగింది. ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, యువజన సంఘాలు పాల్గొన్నారు.