అల్లూరి: జిల్లా వ్యాప్తంగా ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు జరిగే ఆధార్ ప్రత్యేక శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ/వార్డు సచివాలయాల జిల్లా నోడల్ అధికారి పీ.ఎస్. కుమార్ తెలిపారు. ఆధార్ కార్డుల్లో తప్పులు సరిచేసుకోవడానికి, నవీకరించుకోవడానికి శిబిరాలకు రావాలన్నారు. ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి అని పేర్కొన్నారు.