విశాఖ: తూర్పు నౌకాదళం పరిధిలో గల ఐఎన్ఎస్ వీరబాహులో ఆయుప్రవిద క్లినిక్‌లో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన మోడరన్ మెడికల్ తనిఖీ రూమ్‌ను కమాండ్ మెడికల్ ఆఫీసర్ రియర్ అడ్మిరల్ అజిత్ గోపీనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత నావికా దళంలో పనిచేసే సిబ్బందికి అత్యుత్తమ వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.