ప్రకాశం: ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఇవ్వవలసిన డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని యుటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఏ సురేశ్ డిమాండ్ చేశారు. స్థానిక యుటీఎఫ్ కార్యాలయంలో మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మధ్యంతర భృతిని వెంటనే మంజూరు చేయాలని కోరారు.