గుంటూరు: కర్లపాలెం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సిబ్బంది సమయానికి రావడం లేదని, దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నామని రోగులు వాపోయారు. ఉదయం 9 గంటలకే వైద్యశాలలో ఉండాల్సిన సిబ్బంది.. 9:30 అయిన కూడా విధులకు హాజరు కాకపోవటం, డాక్టర్ రూము ఖాళీగా దర్శనం ఇస్తున్నట్లు తెలిపారు.