SS: పెనుకొండ మండలం కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్లో నూతన ఎస్సైగా రాఘవయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం పోలీస్ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎస్సై మాట్లాడుతూ.. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, పారదర్శకంగా విధులు నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.