Adipurush : 'ఆదిపురుష్' లేటెస్ట్ అప్డేట్ వచ్చింది! : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ డైరెక్టర్ ఓం రౌత్ ఒకే ఒక్క టీజర్‌తో సీన్ రివర్స్ చేసేశాడు. ఆదిపురుష్ టీజర్ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ డైరెక్టర్ ఓం రౌత్ ఒకే ఒక్క టీజర్‌తో సీన్ రివర్స్ చేసేశాడు. ఆదిపురుష్ టీజర్ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. దాంతో సినిమాను ఏకంగా ఆరు నెలలు పోస్ట్ పోన్ చేశాడు. గ్రాఫిక్స్ కోసం ఇంకాస్త టైం కావాలంటూ.. జూన్ 16కి వాయిదా వేశారు. దీనికోసం ఏకంగా 100 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నట్టు టాక్. ఇది తప్పితే ఆదిపురుష్ నుంచి మరో అప్డేట్ లేదు. దాంతో మళ్లీ ఈ సినిమా పోస్ట్ అవుతుందనే ప్రచారం జరిగింది. అందుకే మధ్యలో మరోసారి జూన్‌లోనే వస్తామని చెప్పుకొచ్చారు. కానీ గ్రాఫిక్స్ ఎక్కడి వరకు వచ్చిందనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఆదిపురుష్ ప్రజెంట్ స్టాటస్ ఏంటనేది ఎవరికీ తెలియదు. అయితే ఎట్టకేలకు ఓ అప్డేట్ మాత్రం బయటకొచ్చింది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపు 70 శాతం పూర్తయినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటి వరకు వచ్చిన ఔట్ పుట్ విషయంలో ఓం రౌత్ సంతృప్తిగా ఉన్నాడని సమాచారం. దాంతో జూన్‌లో ఆదిపురుష్ రిలీజ్ అవడం పక్కా అంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఏప్రిల్‌లో ఆదిపురుష్ నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అప్పటి నుంచే వరుస అప్డేట్స్ ఇవ్వబోతున్నారట. వాస్తవానికి టీజర్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఆదిపురుష్ పై నెగెటివిటీ ఎక్కువైపోయింది. దాన్ని మరిచేలా చేయాలంటే.. ఖచ్చితంగా కొత్త టీజర్ అప్డేట్ రావాల్సిందే. అయితే ఇన్ని రోజులు ఆదిపురుష్ గురించి.. మేకర్స్‌తో పాటు, బీ టౌన్లోను ఎలాంటి సౌండ్ లేదు. కానీ ఈ అప్డేట్ చూసిన తర్వాత.. హమ్మయ్య, ఓం రౌత్ అఫిషీయల్‌గా చెప్పకపోయినా.. ఎట్టకేలకు ఓ అప్డేట్ మాత్రం వచ్చిందని ఊపిరి పీల్చుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.