»Madhavi Latha Comments On Adipurush Movie And Prabhas
Madhavi latha: ఆదిపురుష్ చెత్త మూవీ..50% ప్రభాస్ ది మిస్టెక్
టాలీవుడ్ నటి మాధవీలత ఆదిపురుష్ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఈ సినిమా హిందువులను విభజించడానికే తీశారని తెలిపింది. మరోవైపు ఈ చిత్రంలో హీరోగా చేసిన ప్రభాస్ ది కూడా 50 శాతం తప్పు ఉందన్నారు.
madhavi latha comments on adipurush movie and prabhas
నటి, రాజకీయ నాయకురాలు మాధవీలత(madhavi latha) మళ్లీ యాక్టివ్‌గా మారారు. గత కొంత కాలంగా మీడియాకు దూరంగా ఉన్న మాధవీలత మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. గతంలో మాదిరిగా తనదైన శైలిలో ముక్కుసూటిగా మాట్లాడుతూ దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఇటివల ‘ఆదిపురుష్’, ‘భగవంత్ కేసరి’ సినిమాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల మాధవీలత ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాలు, రాజకీయాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆమె ‘ఆదిపురుష్(adipurush)’ సినిమాపై కూడా స్పందించారు. ఈ మూవీ బ్లండర్, డిజాస్టర్, డర్టీయెస్ట్ అని వ్యాఖ్యానించారు. హిందువులను విభజించడానికే ఈ సినిమా చేశారని దర్శకనిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ మూవీ విషయంలో హీరో ప్రభాస్ ది కూడా 50 శాతం తప్పు ఉన్నట్లు చెప్పింది. ప్రభాస్ ఫ్యాన్స్ తిట్టుకుంటే తిట్టుకోని కాని ఇది మాత్రం నిజమని తెలిపింది. హీరోకు బాధ్యత లేదా అని ప్రశ్నించింది. స్టోరీ వినే క్రమంలో డైరెక్టర్ ఏది చెప్తే అది తెలుసుకోకుండా ఎలా చేస్తారని అడిగింది. అంతేకాదు అసలు రామాయణం గురించి సినిమా చేసేటప్పుడు ఆ స్టోరీ గురించి తెలుసుకోరా? బాధ్యత లేదా అని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే సినిమాటిక్ లిబర్టీ పేరుతో రామాయణాన్ని తప్పుగా చూపిస్తున్నారని మాధవీలత వెల్లడించింది. సినిమా అనేది చాలా పెద్ద మాధ్యమమని..దీని ద్వారా ఎలాంటి అంశమైనా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని అన్నారు. అలాంటి క్రమంలో ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేయవద్దని మాధవీలత కోరింది.
ఆ వెంటనే మాధవి ‘భగవంత్ కేసరి(bhagavanth kesari)’లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కి వెళ్లింది. ‘హీరోల ద్వారా ఇలాంటి మాటలు చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. కానీ సినిమా మొత్తం హీరోయిన్ పాత్రను గ్లామర్‌కే పరిమితం చేసి హీరోతో ఇలా మాట్లాడిస్తే..ఎలా అని పేర్కొన్నారు. అలా కాకుండా కథానాయిక పాత్రకు కూడా చాలా గౌరవం ఉంటే బాగుంటుందన్నారు. నిజ జీవితంలో కూడా ఇలాగే ఫాలో అయితే ఇంకా మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ అమ్మాయిలపై(grils) వివక్ష కొనసాగుతూనే ఉన్నట్లు మాధవీలత తెలిపారు. తెలుగు యువతులకు సరిగ్గా రెమ్యునరేషన్ ఇవ్వరని పేర్కొన్నారు. కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి మాత్రం భారీగా డబ్బులు ఇస్తారని వెల్లడించారు. దీంతోపాటు తన హైట్ విషయంలో కూడా తాను విమర్శలు ఎదుర్కొన్నట్లు గుర్తు చేశారు. అయితే మాధవీ లత 2008లో విడుదలైన నచ్చావులే చిత్రంతో మాధవీలత టాలీవుడ్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్నేహితుడా, అరవింద్ 2 వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది.