కార్తీ, అను ఇమ్మాన్యుయేల్ నటించిన జపాన్ చిత్రం నిన్న విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా ఏ మేరకు కలెక్షన్లు సాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళ్ స్టార్ హీరో కార్తీక్ శివకుమార్, అను ఇమ్మాన్యుయేల్, సునీల్ వర్మ జంటగా నటించిన జపాన్ చిత్రం(japan movie) నిన్న విడుదల కాగా..బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. అయితే ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏ మేరకు కలెక్షన్లను సాధించిందో ఇప్పుడు చుద్దాం. జపాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు దేశంలో రూ.7 నుంచి రూ.8 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ చిత్రం 2023లో 7వ అత్యధిక ఓపెనింగ్గా సాధించిందని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల గురించి మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
రాజు మురుగన్(Raju Murugan) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించింది. ఈ సినిమా నిన్న పాన్ ఇండియా లెవల్లో పలు భాషల్లో విడుదల కాగా..ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. జపాన్ చిత్రంలో కార్తీ, అను ఇమ్మాన్యుయేల్, సునీల్ వర్మ, కేఎస్ రవికుమార్, వాగై చంద్రశేఖర్, విజయ్ మిల్టన్ కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో పోటీ లేని నేపథ్యంలో ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్లు సాధించే అవకాశం ఉంది.