»Justice Abdul Nazeer Appointed As The New Governor Of Ap
Breaking:ఏపీకి కొత్త గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్(Abdul Nazeer)..12 రాష్ట్రాల్లో కూడా మార్పు
ఏపీకి కొత్త గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ఏపీకి ప్రస్తుతం ఉన్న గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్ కు బదిలీ అయ్యారు. దీంతోపాటు 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి(ap government) కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్ అబ్దుల్ నజీర్(Abdul Nazeer) నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్రపతి భవన్(president bhavan) ప్రకటించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బిశ్వ భూషణ్ హరిచందన్(biswabhusan harichandan) ఛత్తీస్‌గఢ్ కు బదిలీ అయ్యారు.
కీలక కేసుల్లో
జస్టిస్ నజీర్(Abdul Nazeer) కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని బెలువాయిలో జనవరి 5, 1958న జన్మించారు. మంగళూరులోని SDM న్యాయ కళాశాలలో LLB డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఫిబ్రవరి 18, 1983లో న్యాయవాద వృత్తి చేపట్టారు. ఆ తర్వాత కర్ణాటక హైకోర్టులో ప్రాక్టీస్ చేసి, మే 12, 2003న నజీర్ దాని అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అదే క్రమంలో సెప్టెంబర్ 24, 2004న శాశ్వత న్యాయమూర్తిగా మారి అటు తర్వాత ఫిబ్రవరి 17, 2017న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందాడు. అంతేకాదు ట్రిపుల్ తలాక్, గోప్యత హక్కు, అయోధ్య కేసు సహా ఇటీవల నోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్న 2016 నిర్ణయ, చట్టసభల స్వేచ్ఛా వంటి అనేక కీలక కేసుల్లో జస్టిస్ నజీర్ భాగమయ్యారు.
12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం 12 రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ, బీహార్, మహారాష్ట్ర, లడఖ్‌లకు కొత్త గవర్నర్లను నియమించారు.
మహారాష్ట్ర గవర్నర్(maharashtra governor) భగత్ సింగ్ కోష్యారీ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి, రమేష్ బైస్(ramesh bais)ను కొత్త గవర్నర్‌గా ఎంపిక
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్(trivikram parnaik) PVSM, UYSM, YSM (రిటైర్డ్)
సిక్కిం(sikkim) గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య(laxman prasad acharya)