ASR: కొయ్యూరు మండలం బూదరాళ్ల నుంచి పెదవలస వెళ్లే రహదారి మధ్యలో బొంతువలస ఘాట్‌లో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులతో వెళుతున్న ఓ వ్యాన్‌కు బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్‌లో రాజేంద్రపాలెం పీహెచ్‌సీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.