KDP: గోపవరంలో సంఘ సముద్రం గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి కేటాయించిన ప్రభుత్వ స్థలంపై అక్రమ నిర్మాణం వివాదం రేగింది. సర్వే నెంబర్ 1122-2Aలో అధికారులు ఏర్పాటు చేసిన చూచిక బోర్డును తొలగించి ఓ వ్యక్తి నిర్మాణం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.