ASR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్కిల్ హబ్లో ఉచిత కంప్యూటర్ శిక్షణ ప్రారంభించనున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ ప్రసన్న కుమార్ తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లమా పూర్తి చేసిన యువతకు ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయని, ప్రతి కోర్సుకు 30 సీట్లు కేటాయించామని, అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.