MDK: రేగోడ్ మండలం మక్తా వెంకటాపూర్ చెరువులో ఫిష్ పాండ్ నిర్మాణ పనులను సర్పంచ్ సంగమేశ్వర్ ప్రారంభించారు. గ్రామ అభివృద్ధి దిశగా చేపల సాగును ప్రోత్సహించడం ముఖ్య లక్ష్యమని తెలిపారు. చెరువును సమర్థంగా వినియోగించుకుంటే గ్రామానికి ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. చేపల పెంపకం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.