భారీ అంచనాలతో విడుదలై మిక్స్డ్ టాక్ అందుకున్న దేవర సినిమా.. తొలిరోజు అదిరిపోయే కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. నిన్న ఒక్కరోజే రూ.140కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లో రూ.60-70 కోట్లు వచ్చినట్లు సమాచారం. హిందీలో రూ.7కోట్లు.. మిగతా భాషలతో పాటు ఓవర్సీస్లో కలుపుకొని రూ.140కోట్లు వచ్చాయని అంచనా. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.