MS Dhoni పొలంలో చెమట చిందిస్తున్న ధోనీ.. నెక్ట్స్ గ్రౌండ్ లోనే..
వీడియోను చూస్తుంటే ఒక రోజంతా ఆ పనులు చేసినట్లు కనిపిస్తోంది. ధోనీ దగ్గరుండి ఆ భూమిని అంతా చదును చేసినట్లు వీడియో చూస్తే అర్థమవుతున్నది. వీడియో ఆధారంగా ధోనీకి సంబంధించిన వ్యవసాయ భూమి ఎర్ర నేలలు. ఈ నేలలు అత్యంత సారవంతమైనవి. ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటలకు ఈ భూములు అత్యంత అనుకూలం. పంట ధోనీ వేస్తాడో లేదా తన సిబ్బందితో వేయిస్తాడో చూడాలి.
మైదానంలో బ్యాట్ పట్టి భారతదేశం పేరు మార్మోగించిన ఆటగాడు.. తనదైన వ్యూహాలతో ప్రత్యర్థి జట్టులను చిత్తు చేసే అపర చాణక్యం అతడి సొంతం. శాంతమూర్తి.. సౌమ్యుడిగా ఉంటూనే క్రికెట్ (Cricket) చరిత్రలో సువర్ణ అక్షరాలతో తన పేరును లిఖించుకున్న భారత అగ్రగణ్యుడు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni). ఇన్నాళ్లు మైదానంలో కసరత్తులు చేశాడు.. ఇప్పుడు పొలంలో చెమటోడుస్తున్నాడు. బ్యాట్, బంతి పట్టిన చేతులు ఇప్పుడు నాగలి, ట్రాక్టర్ పట్టాయి. ధోనీ రైతు అవతారంలో ప్రత్యక్షమయ్యాడు. తన వ్యవసాయ క్షేత్రం (Farm House)లో పొలం పనులు చేస్తూ బిజీగా గడిపాడు.
నిజ జీవితంలో ధోనీ క్రికెట్ ఆటగాడిగా, ఆర్మీ మేజర్ గా, పోలీస్ అధికారిగా, నటుడిగా పలు పాత్రలో కనిపించాడు. తాజాగా రైతు అవతారంలో కనిపించాడు. స్వయంగా ట్రాక్టర్ నడిపి పనులు చేసేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ధోనీ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఓ కామెంట్ చేశాడు. ‘కొత్తది నేర్చుకోవడం బాగుంది. అయితే పని పూర్తి చేయడానికి మాత్రం చాలా సమయం పట్టింది’ అంటూ పోస్టు చేశాడు.
ఝార్ఖండ్ కు చెందిన ధోనీ తన స్వస్థలం రాంచీ (Ranchi)లో వ్యవసాయ క్షేత్రం (Farm House) ఏర్పాటు చేసుకున్నాడు. వీలు కుదిరినప్పుడల్లా అక్కడికి వెళ్లి వ్యవసాయ పనులు చేస్తుంటాడు. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఒక్క వ్యవసాయమే కాదు పాడి పరిశ్రమను కూడా నడిపిస్తున్నాడు. అత్యంత పోషక విలువలు ఉండే కడక్ నాథ్ కోళ్లను ధోనీ ఫామ్ హౌస్ లో పెంచుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సొంతంగా వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు.
బనీయన్, బ్లూ రంగు టీ షర్ట్, ట్రాక్ ప్యాంట్ ధరించి బూట్లు వేసుకుని పొలంలోకి దిగాడు. తన సహాయకుడి సలహాలతో అతడు ట్రాక్టర్ చక్కగా నడిపాడు. గుట్టలు గుట్టలుగా ఉన్న తన పొలాన్ని చదును చేశాడు. వీడియోను చూస్తుంటే ఒక రోజంతా ఆ పనులు చేసినట్లు కనిపిస్తోంది. ధోనీ దగ్గరుండి ఆ భూమిని అంతా చదును చేసినట్లు వీడియో చూస్తే అర్థమవుతున్నది. వీడియో ఆధారంగా ధోనీకి సంబంధించిన వ్యవసాయ భూమి ఎర్ర నేలలు. ఈ నేలలు అత్యంత సారవంతమైనవి. ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటలకు ఈ భూములు అత్యంత అనుకూలం. ఇప్పుడు కొత్తగా పంట వేసేందుకు ఈ భూమిని చదును చేసినట్లు కనిపిస్తున్నది. పంట కూడా ధోనీ వేస్తాడో అతడి సిబ్బందితో వేయిస్తాడో చూడాలి.
ఇక క్రికెట్ విషయాలకు వస్తే ధోనీ ఇంకా ఐపీఎల్ (IPL)లో కొనసాగుతున్నాడు. తన సొంత జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings- CSK) తరఫున మరోసారి ఐపీఎల్ లో ఆడనున్నాడు. తన ఫ్రాంచైజీకి ట్రోఫీ అందించి ఇక క్రికెట్ కు పూర్తిగా వీడ్కోలు పలుకాలనే ఆలోచనలో ధోనీ ఉన్నాడు. 2023 ఐపీఎల్ కోసం ధోనీ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించాడు. క్రికెట్ గణాంకాలు పరిశీలిస్తే ధోనీ అన్ని ఫార్మాట్లు కలిపి మొత్తం 538 మ్యాచ్ లు ఆడాడు. 21,834 పరుగులు చేయగా వాటిలో 16 శతకాలు, 108 అర్థ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఆడబోయే ఐపీఎల్ సీజన్ ఆఖరిదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ధోనీ వయసు మీద పడడంతో ఆటకు అతడి శరీరం సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సీజన్ తో క్రికెట్ కు పూర్తిగా జరుగనున్నాడు.