AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత పూర్తిగా కోల్పోయిందని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని రైతులు, యువత, మహిళలను ఈ ప్రభుత్వం విస్మరించిందని.. హామీలు తుంగలో తొక్కుతూ ప్రజల జీవితాలతో ఆటలాడుతోందని మండిపడ్డారు. మూసీ సుందరీకరణ పేరిట కొత్త మోసానికి తెరలేపారని ఆరోపించారు. హైడ్రా గురించి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించారు.