T20 WCలో సౌతాఫ్రికాపై భారత్ భారీ తేడాతో ఓటమిపాలవడంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. వరుస విజయాల తర్వాత ఇలాంటి ఓటమి ఎదురవడం సహజమని, ఇది జట్టుకు అలర్ట్ లాంటిదని అభిప్రాయపడ్డాడు. సెమీఫైనల్స్ వంటి కీలక స్టేజ్లో కాకుండా ఇప్పుడే ఓటమి ఎదురైనందుకు సంతోషిస్తున్నా అని అన్నాడు. ఈ ఓటమితో జట్టు తన గేమ్ ప్లానింగ్ చేసుకుని విజయం సాధించే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నాడు.