W.G: తణుకు మండలం కోనాల గ్రామానికి చెందిన తానంకి శ్రావణి(14) మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ప్రధానోపాధ్యాయుడు మందలించడంతో మనస్థాపం చెందిన శ్రావణి గురువారం ముద్దాపురం మూలలంక కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శ్రావణి ఆచూకీ కోసం గాలించిన ఫైర్, ఎన్డీఆర్ ఆఫ్ సిబ్బందికి శుక్రవారం శ్రావణి మృతదేహాన్ని గుర్తించి తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.