వరంగల్: చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిపాలన విభాగం కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్యఅతిథిగా పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.