NLR: ఏపీ టెట్ (టీచర్ ఎలిజిబుల్ టెస్ట్) పరీక్షను అక్టోబర్ 3 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో రామారావు తెలిపారు. ఈ పరీక్షలు జిల్లాలోని PBR విశ్వోదయ కళాశాల (కావలి), RSR కళాశాల (కడనూతల), నారాయణ ఇంజినీరింగ్ కళాశాల ( నెల్లూరు), అయాన్ డిజిటల్ సెంటర్ (పొట్టేపాలెం)లో జరుగుతాయన్నారు. అభ్యర్థులు సమయానికి 30నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి రావాలన్నారు.