KRNL: కర్నూలులోని స్టేట్ గెస్ట్ హౌస్లో ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్ లక్ష్మీరెడ్డిని మంగళవారం వివిధ శాఖల జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సివిల్ సప్లైస్ డీఎస్ఓ ఎం.రాజా రఘువీర్ పూలమొక్క, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. కర్నూలు అర్బన్ తహసీల్దార్ రవికుమార్ పాల్గొన్నారు. జిల్లాలో ఆహార భద్రత, పౌర సరఫరాల అమలుపై చర్చించారు.