BPT: రహదారి ప్రమాదాలను నియంత్రించడం లక్ష్యంగా నిత్యం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని చందోలు ఎస్సై శివకుమార్ చెప్పారు. మంగళవారం చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డిపాలెం గ్రామ జాతీయ రహదారిపై ఆయన వాహన తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తూ, అనుమతి పత్రాలు కలిగి ఉండాలన్నారు.