NDL: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో స్వచ్ఛంద సేవకు ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్లో నమోదు చేసుకోవచ్చని ఆలయ ఈవో శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం స్వచ్ఛంద శివసేవకులతో సమావేశం నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ.. బృందాలుగా, వ్యక్తిగతంగా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వచ్ఛంద సేవకుల సేవలను వినియోగించుకుంటామన్నారు.