ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2’ పై భారీ అంచనాలున్నాయి. పుష్ప సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను.. సుకుమార్ భారీగా తెరకెక్కిస్తున్నాడు. బడ్జెట్ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ తగ్గేదేలే అంటున్నారు. ఈ మధ్యే పుష్ప2 షూటింగ్ వైజాగ్‌లో స్టార్ట్ అయింది. పోర్ట్ ఏరియాలో కొన్ని కీలక సన్నివేశాలు, ఇంట్రడక్షన్ సాంగ్‌ని షూట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా వైజాగ్ షెడ్యూల్ పూర్తయిపోయింది. బన్నీనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. వైజాగ్ బీచ్‌లో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. ‘థ్యాంక్యూ వైజాగ్’.. విశాఖపట్నం తనకు ఎప్పుడూ చాలా స్పెషల్ అని.. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు బన్నీ. దాంతో నెక్స్ట్ పుష్పరాజ్ షూటింగ్ ఎక్కడని ఆరా తీస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. ఈ క్రమంలో పుష్ప చిత్ర యూనిట్.. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిమ్ సిటీకి షిఫ్ట్ అవ్వబోతుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడే ఓ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. మరో రెండ్రోజుల్లో ఫిలిమ్ సిటీలో వేసిన భారీ సెట్లో షూట్ స్టార్ట్ చేయబోతున్నారట. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కించబోతున్నారట. ఇప్పటికే షూటింగ్ లేట్ చేసిన సుక్కు.. ఇకపై ఏ మాత్రం గ్యాప్ లేకుండా పుష్ప2ని కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడట. అందుకే కొన్ని రోజులు ఫిలిం సిటీలోనే ఉండోబోతోందట చిత్ర యూనిట్. దాంతో సుకుమార్ స్పీడ్ పెంచినట్టే కనిపిస్తోంది. మరి అస్సలు తగ్గేదేలే అంటున్న బన్నీ, సుకుమార్.. ఈసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.