శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అనుర కుమార దిసనాయకేకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. విజన్ ‘సాగర్’ ‘పొరుగుకు ప్రాధాన్యం’లో శ్రీలంకకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొంటూ.. కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అందుకు బదులిస్తూ ‘మీ మద్దతుకు కృతజ్ఞతలు, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేద్దాం’ అంటూ దిసనాయకే రిప్లై ఇచ్చారు.