JGL: మాజీమంత్రి జీవన్ రెడ్డి రాజకీయ వారసులెవరన్న చర్చకు తెరపడినట్లే కనిపిస్తోంది. ఇప్పటివరకు తనయుడు రామచంద్ర రెడ్డి పేరు వినిపించాయి. కానీ, ప్రస్తుతం ఆయన కోడలు, చంద్రకృష్ణ సతీమణి చరిష్మా రెడ్డి పేరు ఇప్పుడు నియోజకవర్గంలో మార్మోగుతోంది. ఇటీవల కేటీఆర్ పర్యటన సందర్భంగా గులాబీ మహిళా శ్రేణులు చరిష్మాతో భేటీ అయ్యేందుకు, ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు.