GNTR: తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం చంద్రబాబుని టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన దేవస్థానం ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య సీఎంకి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి, బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు సీఎంకు తీర్థప్రసాదాలు అందజేశారు.