AP: టీటీడీకి పాల ఉత్పత్తులు అందించడానికి తెలంగాణ విజయ డెయిరీ సిద్ధం అయింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సమర్పించే నైవేద్యాల కోసం స్వచ్ఛమైన, నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ పశుసంవర్థక శాఖకు చెందిన విజయ డెయిరీ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు TTD ఈవో శ్యామలరావుకు లేఖ అందించింది. దేశవ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తుల రంగంలో తెలంగాణ విజయడెయిరీ సంస్థ ప్రసిద్ధి చెందిందని.. రాష్ట్ర అధికారులు తెలిపారు.