రవితేజ నటించిన “మిస్టర్ బచ్చన్” రామ్ పోతినేని హీరోగా నటించిన “డబుల్ ఇస్మార్ట్” సినిమాలకు ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించిన ఎర్లీ మార్నింగ్ షోలకు నెగటివ్ టాక్ వచ్చింది. మిస్టర్ బచ్చన్ ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు వేశారు. నిన్న రాత్రి నుంచే ఈ సినిమాకు నెగటివ్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ రెండు సినిమాలు ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదలై మంచి వసూళ్లు రాబడతాయని బయ్యర్లు కొండంత ఆశలతో ఉన్నారు. కానీ, ప్రారంభ ప్రదర్శనల్లోనే ఆడియన్స్ నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
“మిస్టర్ బచ్చన్” సినిమా స్క్రీన్‌ప్లేలో, మరియు డైరక్షన్ చాలా వీక్ గా ఉన్నట్టు చెబుతున్నారు. రవి తేజా నటనకు, కొత్త హీరోయిన్ భాగ్యశ్రీ కు మంచి మార్కులే పడినప్పటికీ, డైరెక్షన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. .
అదే విధంగా, “డబుల్ ఇస్మార్ట్” కూడా నిరాశనే మిగిల్చిందని సోషల్ మీడియా మొత్తం నెగటివ్ తాల్ స్ప్రెడ్ అయింది. రామ్ పోతినేని నటనకు మంచి మార్కులు వచ్చినప్పటికీ, సినిమా కథ, పేసింగ్, మరియు వినోదం విషయాల్లో తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఫ్యాన్స్. పూరి జగన్నాథ్ డైరెక్షన్ పై కూడా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రొటీన్ టేకింగ్, అలీ క్రింజ్ కామెడీ పై నెగటివ్ రిపోర్ట్ ఉంది.
ఈ సినిమాలు విడుదలైనప్పటి నుండి ప్రేక్షకుల స్పందన కూడా తీరుగా లేకపోవడంతో లాంగ్ వీకెండ్ అయినప్పటికీ లాంగ్ రన్ లో సినిమా రన్ ఎలా ఉంటుందో అని బయ్యర్లు భయపడుతున్నారు. రవి తేజ గత సినిమా ఈగల్, రామ్ పోతినేని గత సినిమా స్కంద కూడా ఆశించినంత స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయాయి