తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని సంక్షేమ పథకాలను ప్రకటించారు. హైదరాబాద్ గోల్కొండ కోటలో జాతీయ జెండా వందన కార్యక్రమంలో జెండా ఆవిష్కరించి, స్వాతంత్య్ర వీరులకు నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకమైన సంక్షేమ పథకాల గురించి వివరించారు. విద్యార్థులు చెప్పుడు మాటలు విని మోసపోవద్దు.. మీకు తగిన న్యాయం చేసే భాద్యత పెద్దన్నగా నేను తీసుకుంటాను అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన రైతులకు ఎకరాకు 15వేలు రైతు భరోసా ద్వారా అందించే సంకల్పంతో ప్రభుత్వం ఉందని వెల్లడించారు. గత BRS ప్రభుత్వంలో రైతుబంధు పథకం ద్వార అవకతవకలు జరిగి దుర్వినియోగం అయ్యిందని అన్నారు
రాజీవ్ ఆరోగ్యశ్రీలో కొత్తగా 163 చికిత్సలు ప్రవేశపెట్టాం.. వైద్య చికిత్సల పరిమితి 5 నుంచి 10 లక్షలకు పెంచాం అని సీఎం అన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మరియు దేశభక్తి, సామాజిక సమానత్వం, అభివృద్ధి పరమైన తెలంగాణ నిర్మాణానికి ప్రజలందరూ కలిసి పనిచేయాలని ప్రోత్సహించారు.