»What Is The Right Time To Have Chia Seeds For Weight Loss
Chia Seeds : బరువు తగ్గాలంటే చియా సీడ్స్ వాటర్ ఎప్పుడు తాగాలో తెలుసా ?
ఈ రోజుల్లో చాలా మంది సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఊబకాయంతో బాధపడుతున్నారు. దీన్ని వదిలించుకోవడానికి కొంతమంది జిమ్‌కి వెళ్లి గంటల తరబడి కష్టపడి పనిచేయడానికి
Chia Seeds : ఈ రోజుల్లో చాలా మంది సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఊబకాయంతో బాధపడుతున్నారు. దీన్ని వదిలించుకోవడానికి కొంతమంది జిమ్‌కి వెళ్లి గంటల తరబడి కష్టపడి పనిచేయడానికి ఇష్టపడితే, మరో వైపు కొంతమంది యోగా లేదా హోమ్ వర్కౌట్, రన్నింగ్ వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను వారి జీవనశైలిలో చేర్చుకుంటారు. అయితే దీనితో పాటు బరువు తగ్గడం కోసం హెల్తీ డ్రింక్స్‌ను ఆశ్రయించే వారు కూడా ఉన్నారు. చాలా మంది బరువు తగ్గించే పానీయాల గురించి మాట్లాడేటప్పుడు.. చియా విత్తనాల గురించి ఆలోచన వస్తుంది. బరువు తగ్గడానికి అనేక పదార్థాలను ఆహారంలో చేర్చుకోవచ్చు. అయితే ఏ సమయంలో తినడం లేదా త్రాగడం వల్ల బరువు తగ్గుతారో తెలుసుకోవాలి.
ఆరోగ్యంగా ఉండటానికి మీ ఆహారంలో చియా విత్తనాలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఈ చిరు ధాన్యాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ బి3, సెలీనియం, మాంగనీస్ వీటిలో ఉంటాయి. చియా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. చియా విత్తనాలు బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా రక్తపోటు, కొలెస్ట్రాల్ , మధుమేహం వంటి సమస్యలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. చియా సీడ్స్‌ని రోజూ మీ డైట్లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గుతారు.
చియా గింజల్లో ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ పొట్ట చాలా కాలం పాటు నిండుగా ఉంటుంది. ఈ నీటిని తాగిన తర్వాత ఎక్కువసేపు ఆకలి వేయదు. చియా గింజల నీరు మీ ఆకలిని తగ్గిస్తుంది. అతిగా తినడం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ విధంగా చియా విత్తనాలు బరువు తగ్గడంలో మేలు చేస్తాయి.
చియా గింజల నీటిని ఎప్పుడు త్రాగాలి?
1.బరువు తగ్గడానికి, మీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో చియా గింజల నీటిని తాగాలి. దీని కోసం, చియా గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం ద్వారా ప్రయోజనం లభిస్తుంది.
2. చియా గింజలను పండ్లపై చిలకరించడం ద్వారా అల్పాహారంలో కూడా తినవచ్చు.
3. ఉదయం టీ లేదా కాఫీకి బదులుగా ఈ పానీయాన్ని చేర్చుకోవచ్చు.
4. అల్పాహారం లేదా భోజనంలో గంజితో కూడా తినవచ్చు.