»A New Feature In Whatsapp Provides Voice Messages As Texts
WhatsApp: వాట్సప్‌లో కొత్త ఫీచర్.. వాయిస్ మెసెజ్‌లను టెక్ట్స్‌గా అందిస్తుంది.
వాట్సప్ వినియోదారుల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వలన చాలా మందికి వాయిస్ మెసేజ్‌లు వినలేకపోతున్నాము అనే ఫీలింగ్ నుంచి ఉపశమనం కలగనుంది.
WhatsApp: వాట్సప్‌లో కొత్త ఫీచర్.. వాయిస్ మెసెజ్‌లను టెక్ట్స్‌గా అందిస్తుంది.
WhatsApp: మెసేజింగ్ యాప్ వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది చాలా మందికి ఉపయోగపడనుంది. చాలా సందర్భలలో మనకు వాయిస్ మెసేజ్‌లు వస్తుంటాయి. ఆ సమయంలో వాటిని వినలేము. కొన్నిసార్లు బస్సులో, రద్దీ ప్రదేశాల్లో ఉన్నప్పుడు వచ్చిన వాయిస్ మెసేజ్‌లను వినాలంటే ఇయర్ ఫోన్స్ ఉండాలి. అవి లేని సమయంలో వాటిని వినలంటే మళ్లీ ఏలాంటి శబ్దాలు లేకుండా ఉండాలి. అలాంటప్పుడు వాయిస్‌లో ఏం ఉందో తెలుసుకోవడం కుదరదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాట్సప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ట్రాన్స్‌స్క్రిప్షన్ ఫీచర్ అనేదాన్ని పరిచయం చేసింది. దీని ద్వారా వాయిస్‌లో ఉన్న మ్యాటర్‌ను టెక్ట్స్ రూపంలో మనకు అందిస్తుంది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌కు మాత్రమే అందుబాటులో ఉంది.
వాట్సప్ సంస్థం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సరికొత్త ఫీచర్ వాయిస్ మెసేజ్ రాగానే దాని ఓపెన్ చేయగానే ట్రాన్స్‌స్క్రిప్షన్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే అందులోని సందేశం టెక్ట్స్ రూపంలో కనిపిస్తుంది. అయిత ఇది భాషను ట్రాన్స్‌లేట్ చేయదు. ఏ భాషాలో పంపితే అదే భాషలో అక్షరాల రూపంలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఇంగ్లిష్, హిందీ, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్ భాషలలో అందుబాటులో ఉంది. ఈ ప్రయోగం విజవంతం అవడంతో ఇతర భాషలకూ తీసుకొంచే ఆలోచనలో ఉంది. త్వరలోనే తెలుగులో రాబోతుందని తెలుస్తుంది.