»Pigeon Feathers And Dropping Prolonged Contact Severe Health Risks Fatal Allergic Reactions
Delhi : ఢిల్లీకి ప్రాణాపాయంగా మారిన పావురాలు
మీకు పావురాలను పెంచుకోవడం ఇష్టమా అయితే వాటితో జాగ్రత్త. ఎందుకంటే పావురం ఈకలు, రెట్టలు నేరుగా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ మేరకు ఓ అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Delhi : మీకు పావురాలను పెంచుకోవడం ఇష్టమా అయితే వాటితో జాగ్రత్త. ఎందుకంటే పావురం ఈకలు, రెట్టలు నేరుగా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ మేరకు ఓ అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పావురం ఈకలు, రెట్టలతో సంబంధం కలిగి ఉండటం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా చిన్నారులు, యువత ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ అధ్యయనం ఢిల్లీ నివాసి అయిన ఒక అబ్బాయికి సంబంధించినది. పావురం ఈకలు, రెట్టలకు ఎక్కువసేపు గురికావడం వల్ల, బాలుడు అలెర్జీ భారిన పడ్డాడు. అది ముదిరి ప్రాణంతకంగా మారింది. తూర్పు ఢిల్లీకి చెందిన 11 ఏళ్ల బాలుడిని సర్ గంగారామ్ ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు అధ్యయనానికి సంబంధించిన వైద్యులు తెలిపారు. మొదట్లో అతని లక్షణాలు సాధారణ దగ్గులా ఉన్నాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో బాలుడి పరిస్థితి విషమంగా మారింది.
చిన్నారిని పరీక్షించినప్పుడు హైపర్సెన్సిటివిటీ న్యుమోనైటిస్ (హెచ్పీ)తో బాధపడుతున్నట్లు తేలిందని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ) కో-డైరెక్టర్ డాక్టర్ ధీరేన్ గుప్తా తెలిపారు. పావురం-సంబంధిత ప్రొటీన్లకు అలెర్జీ వల్ల ఇది సంభవించింది. చిన్నారికి తక్షణ చికిత్స అందించాల్సిన పరిస్థితి నెలకొంది.
హైపర్సెన్సిటివిటీ న్యుమోనిటిస్ అంటే ఏమిటి?
హైపర్సెన్సిటివిటీ న్యుమోనైటిస్ అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అని డాక్టర్ ధీర్నే గుప్తా చెప్పారు. ఈ వ్యాధితో బాధపడిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. యువతలో ఈ పరిస్థితి సాధారణంగా ఉంటుందని, అయితే పిల్లల్లో మాత్రం ఇది చాలా అరుదని అన్నారు. ఈ వ్యాధి ఏడాదిలో లక్ష మంది జనాభాకు ఇద్దరు నుంచి నలుగురికి సోకుతుందని అంచనా.
చిన్నారికి ఎలా చికిత్స అందించారు?
హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్తో బాధపడుతున్న బాలుడికి స్టెరాయిడ్ మందు ఇచ్చామని తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే హై ప్రెజర్ ఆక్సిజన్ థెరపీ ఇచ్చారు. ఈ థెరపీ ద్వారా, ముక్కులో ట్యూబ్ను చొప్పించడం ద్వారా శరీరానికి ఆక్సిజన్ పంపబడుతుంది. ఈ థెరపీ పిల్లల ఊపిరితిత్తులలో వాపును తగ్గించడంలో.. శ్వాసను దాదాపు సాధారణ స్థాయికి తీసుకురావడంలో సహాయపడిందని గుప్తా అధ్యయనంలో చెప్పారు. చికిత్స సానుకూల ప్రభావాలు, ఇంటెన్సివ్ కేర్ సూచనల కారణంగా అతను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు.
హైపర్సెన్సిటివిటీ న్యుమోనిటిస్ ఎందుకు వస్తుంది?
పక్షి రెట్టలు, శిలీంధ్రాలు వంటి కొన్ని పర్యావరణ పదార్థాలకు పదేపదే బహిర్గతం కావడం వల్ల హైపర్సెన్సిటివిటీ న్యుమోనైటిస్ పరిస్థితి ఏర్పడుతుందని డాక్టర్ గుప్తా చెప్పారు. దీనితో పాటు, ఈ-సిగరెట్ స్మోకర్ ద్వారా వెలువడే పొగతో సంబంధంలోకి వచ్చినప్పుడు కూడా అలాంటి పరిస్థితి తలెత్తవచ్చు. తక్షణ చర్యలతో ఇలాంటి సమస్యలను అరికట్టవచ్చని తెలిపారు. దీంతో పాటు పక్షి రెట్టలు, ఈకల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించి ఇలాంటి వ్యాధులను అరికట్టాలన్నారు. పావురాలు, పౌల్ట్రీ పక్షులు చుట్టూ ఉన్నప్పుడు జాగ్రత్త వహించాలని కూడా అతను నొక్కి చెప్పాడు.