ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కటౌట్ చూస్తే.. హాలీవుడ్‌కి మించినట్టుగా ఉంది. లేటెస్ట్ లుక్ చూసి ఘట్టమనేని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ మహేష్ బాబు ఎక్కడికి వెళ్తుంటే.. ఈ ఫోటోలు బయటికొచ్చాయంటే?
Mahesh babu: ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం మేకోవర్ అవుతున్న సూపర్ మహేష్ బాబు.. అప్పుడప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో అలా దర్శనమిస్తున్నాడు. లేటెస్ట్గా మహేష్ బాబు ఫోటోలు చూస్తే మాత్రం.. ఇది కదా హాలీవుడ్ కటౌట్ అంటే, ఇది కదా జక్కన్న మాకు కావాల్సిన కటౌట్.. అనేలా ఉన్నాడు. ఈ ఫోటోలు చూస్తే.. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు దాదాపుగా రెడీ అయినట్టే ఉన్నాడు. లాంగ్ హెయిర్‌లో, క్యాప్‌తో అదిరిపోయాడు మహేష్. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి ఓ రేంజ్లో జరుగుతున్న సంగతి తెలిసిందే.
అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చెంట్ల వివాహం అంగరంగా వైభంవగా జరుగుతోంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ ఈ వేడుకకు వేదిక అయింది. ఇప్పటికే ఈ పెళ్లి కోసం వివిధ దేశాల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు అతిథులుగా వచ్చారు. ఇక టాలీవుడ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కలిసి వెళ్లారు. ఈ పెళ్లికి వెళ్తూ.. తన కొత్త రోల్స్ రాయిస్ కారుని చూపించాడు చరణ్.
అయితే.. టాలీవుడ్ నుంచి చరణ్ ఒక్కడే ఈ పెళ్లికి వెళ్తున్నాడు.. అని అనుకున్నారు. కానీ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వెళ్లాడు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఫ్యామిలీతో కనిపించాడు మహేష్. ఇక మహేష్ నయా లుక్ మాత్రం అదిరిపోయింది. లాంగ్ హెయిర్, రఫ్ గడ్డంతో హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. దీంతో.. ఈ లుక్‌ని తెగ వైరల్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు.