Steroids: స్టెరాయిడ్స్ తరలిస్తున్న ముఠాను సికింద్రబాద్ పోలీసులు పట్టుకున్నారు. భారీ మొత్తంలో స్టెరాయిడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, సికింద్రబాద్ జంటనగరాల్లో వీటిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బాడీ బిల్డింగ్ ట్రై చేసేవారు వీటిని ఎక్కువగా తీసుకుంటారు. అందుకోసమే సిటీలో జిమ్‌లలో స్టెరాయిడ్స్ ఎక్కువగా విక్రయిస్తారు. ఎంతో కాలంగా దీన్ని గుట్టుగా నడిపిస్తున్న ఖాసిం అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్ల పోలీసులు తెలిపారు. సిటీలో డ్రగ్ కంట్రోల్ అధికారులు వీరిపై నిఘా పెట్టినట్లు అందులో భాగంగానే ఖాసీం పట్టుబడ్డట్లు చెప్పారు. స్టెరాయిడ్స్ కొన్ని ప్రత్యేకపరిస్థితుల్లో వైద్యులే సూచిస్తారు. కానీ ఇవి అధికంగా వాడడం శరీరానికి మంచిది కాదు. రక్తానికి ఇది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. దీని వలన బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది.