»Mukesh Ambanis Mass Wedding At 50 A Huge Wedding Gift
Mukesh Ambani: 50 జంటలకు అంబానీ సాముహిక వివాహం.. భారీగా పెళ్లికానుకలు
జులై 12న ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వివాహ వేడుక సందర్భంగా 50 పెళ్లిళ్లను ఒకేసారి జరిపించారు. వారికి పుస్తే, మట్టెలతో పాటు విలువైన బహుమతులు, ఒక సంవత్సరానాకి సరిపడ గృహావసరాలను అందించారు.
Mukesh Ambani's mass wedding at 50.. a huge wedding gift
Mukesh Ambani: ప్రపంచ కుబేరుల్లో ముఖేష్ అంబానీ ఒకరు. రిలయన్స్ ఇండస్ట్రీస్, జీయోవంటి టెలికామ్ రంగాల అధినేత ముకేశ్ అంబానీ పెద్ద మనసు చాటుకున్నారు. మొత్తం 50 మంది పేద జంటల వివాహాలను ఘనంగా జరిపించారు. అంబానీ కుమారుడు అనంత్ అంబానీ–రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలు అట్టహసంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముంబైలోని పాల్ఘర్ ప్రాంతానికి చెందిన 50 మంది నిరుపేద జంటలకు నీతా అంబానీ సామూహిక వివాహాలు జరిపించింది. థానేలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో ఈ వేడుకను జరిపించారు. నీతా అంబానీ దగ్గరుండి నవదంపతులకు కావాల్సిన పెళ్లి బట్టలు, పుస్తెలు, మట్టెలు ఇతర సామాగ్రిని ఇప్పించారు. ఈ వేడుకలో నూతన దంపతులకు సంబంధించిన 800 మంది కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంబానీ కుటుంబం చేసిన పనికి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
హిందు మత సంప్రదాయం ప్రకారం, వేద మంత్రోచ్చారణల మధ్య ముకేశ్–నీతా దంపతులు దగ్గరుండి వీరి వివాహాలు జరిపించారు. వీరితో పాటు ఈ విహహాల పర్వంలో వారి పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ–శ్లోకా మెహతా దంపతులు, కుమార్తె ఇషా అంబానీ, అల్లుడు ఆనంద్ పిరమల్ పాల్గొన్నారు. వారందరితో ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. అయితే కొత్త జంటలకు బంగారు మంగళసూత్రం, బంగారు చెవి కమ్మలు, ముక్కు పుడకలు, వెండి మెట్టెలు, గజ్జెలు అందిచ్చారు. అలాగే వదువుకట్నం కింద రూ. లక్ష ఒక్క రూపాయి చెక్కు సైతం అందించారు. అంతేకాకుండా నవదంపతులకు ఒక ఏడాది పాటు గ్యాస్ స్టౌవ్, మిక్సీ, ఫ్యాన్ తోపాట.. నిత్యావసర సరుకులను అందజేశారు. అందులో బియ్యం, నూనే, పప్పుదన్యాలు ఇలా మొత్తం 36 వస్తువలను ఉచితంగా అందిచ్చారు.
జులై 12న అనంత్ అంబానీ–రాధికా మర్చంట్లల వివాహం జరగనుంది. ఈ వేడుక మూడు రోజులు జరగనున్నట్లు తెలుస్తుంది. ఇదివరకు ఈ వేడుకకు సంబంధించి రెండు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. గుజరాత్లో జరిగిన వేడుకకు ప్రపంచం నంచి స్టార్స్, ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. దానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ తరువాత కేవలం ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇటలీ నుంచి ఫ్రాన్స్ మధ్య విలాసవంతమైన క్రూయిజ్ షిప్లో మరో ప్రీ వెడ్డింగ్ నిర్వహించారు.