MBNR: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో జడ్చర్ల RBSK బృందం రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి సాధించింది. మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్న బృందాన్ని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అభినందించారు. వైద్య సేవల్లో జిల్లాకు ఈ గౌరవం దక్కడం గర్వకారణమని కలెక్టర్ కొనియాడారు.