Useful Tips: ఈ మూడు కలిపి తీసుకుంటే… మీ చర్మం బంగారంలా మెరుస్తుంది..!
రాత్రిపూట నానబెట్టి, ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్, తింటారు. కానీ రాత్రి పూట 3 వస్తువులను నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలన్నీ తొలగిపోతాయి. మీ చర్మానికి మంచి మెరుగునిస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Useful Tips: ఉదయం పూట కాఫీ, టీలు తాగడం చాలా మందికి అలవాటు. అయితే దాని బదులు వేరే డ్రింక్ తాగడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుందని మీకు తెలుసా? కొందరు వేడినీళ్లు, నిమ్మరసం, తేనె కలిపి తాగుతారు. కానీ ఇది ప్రయోజనకరమైన మార్పులకు దారితీయదని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీని కంటే కీర దోసకాయ, పుదీనా ఆకులు, నిమ్మరసం తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి.
ఒక పెద్ద పాత్ర లేదా గాజు కూజా తీసుకొని అందులో నీటిని ఉంచండి. దోసకాయ, సగం నిమ్మకాయ , కొన్ని పుదీనా ఆకులను తరిగి లోపల ఉంచండి. రాత్రంతా మూతపెట్టి, పళ్లు తోముకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో తాగండి. దీన్ని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.
హైడ్రేషన్..
ఈ నీరు శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే దీన్ని తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గి రోజంతా శరీరం చల్లగా ఉంటుంది. దోసకాయలో 95 శాతం నీరు ఉంటుంది. నిమ్మకాయలోని ఆమ్ల గుణాలు మన జీర్ణక్రియకు సహాయపడతాయి. అలాగే శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
బరువు తగ్గడం:
ప్రతిరోజూ ఉదయాన్నే ఈ నీటిని సిద్ధం చేసుకుని తాగడం వల్ల శరీర ఎదుగుదల మెరుగుపడుతుంది. శరీరంలో ఉండే చెడు కొవ్వు తొలగిపోయి త్వరగా బరువు తగ్గుతుంది. ఉదయాన్నే పరగడుపున ఈ డ్రింక్ తాగడం వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది ఆకలిని కలిగించదు. బరువు తగ్గాలనుకునే వారు ఈ డ్రింక్ తాగవచ్చు.
శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది:
ఈ పానీయం మన శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడం ద్వారా మాత్రమే మీరు రిఫ్రెష్‌గా, ఆరోగ్యంగా ఉంటారు. ప్రతిరోజూ ఉదయం ఈ పానీయం తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.
అందం మెరుగుపడుతుంది:శరీరాన్ని పొడిబారకుండా ఉంచుకుంటే చర్మం మెరుస్తుంది. నిమ్మకాయ, పుదీనా, దోసకాయలను నానబెట్టి తయారుచేసిన డ్రింక్ ను రోజూ తాగితే మొటిమలు, బ్లాక్ హెడ్స్ తొలగిపోయి ముఖం మెరిసిపోతుంది. బంగారంలా మెరిసిపోతుంది.
రోగనిరోధక శక్తి:
నిమ్మకాయ, పుదీనా, కీరదోస తో తయారు చేసిన ఈ పానీయంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు , ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని రోజూ ఉదయం తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.