KMR: గుర్జకుంటలో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించే సిమెంట్ రోడ్డు పనులను గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రకాంత్ ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా అవసరాలే లక్ష్యంగా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణంతో తమ ఇబ్బందులు తొలగుతాయని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.