»Mahesh Babus Three Childrens Names Are From Mahesh Babus Movies
Mahesh Babu: ముగ్గురు పిల్లల పేర్లు మహేష్ బాబు సినిమాలే.. అభిమానిని కష్టాల్లో ఆదుకున్న సూపర్ స్టార్!
మా హీరో, మా మహేష్ బాబు గ్రేట్ అంటూ ఘట్టమనేని అభిమానులు మురిసిపోయిన సందర్భాలు లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. ఇప్పుడు మరోసారి మహేష్ సూపర్ అంటూ.. తెగ పొగిడేస్తున్నారు. మరి ఈసారి బాబు ఏం చేశాడు?
Mahesh Babu's three children's names are from Mahesh Babu's movies.
Mahesh Babu: గత కొంత కాలంగా మహేష్ బాబు ఫౌండేషన్ పేరిట పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు మహేష్. గతంలో సూపర్ స్టార్ కృష్ణ మరణించిన రోజు కూడా మహేష్ బాబు ఫౌండేషన్ తన పని ఆపలేదు. ఆర్థికంగా స్తోమత లేని ఓ మూడేళ్ల బాబుకు.. అత్యవసర పరిస్థితుల్లో గుండెకు సర్జరీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేపించడం మాత్రమే కాదు, కొన్ని గ్రామాలను కూడా దత్తత తీసుకున్నాడు. ఇప్పటిదాకా మహేష్ బాబు ఫౌండేషన్ నుంచి 1000 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లను ఉచితంగా చేయించారు. అంతేకాదు తన అభిమానులు ఎవరైనా సరే.. అవసరమైన వారికి వెంటనే సాయం అందిస్తాడు.
తాజాగా మహేష్ మరోసారి తన వీరాభిమానికి అండగా నిలిచాడు. ఏపికి చెందిన రాజేష్ అనే వ్యక్తి.. మహేష్ బాబుకి పెద్ద వీరాభిమాని. ఎంతలా అంటే.. అతని ముగ్గురు కొడుకుల పేర్లు కూడా మహేష్ సినిమా పేర్లనే పెట్టాడు. అర్జున్, అతిథి, ఆగడు సినిమాలు రిలీజ్ అయిన సమంతో పుట్టడంతో.. వాళ్లకు అవే పేర్లు పెట్టాడు. అయితే.. ప్రస్తుతం రాజేష్ కిడ్నకీ సంబంధించిన వ్యాధితో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. దీంతో.. ముగ్గురు కొడుకులు చదువు మానేసి పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం ఫ్యాన్స్ ద్వారా మహేష్ బాబు ఫౌండేషన్‌కి తెలియడంతో.. వారిని పూర్తిగా చదివిస్తామని చెప్పినట్లుగా సమాచారం. ఈ విషయం కాస్త బయటకు రావడంతో మహేష్ బాబును పొగడ్తలతో ముంచేస్తున్నారు నెటిజన్లు.