»June Rainfall 20 Below Average As Monsoon Stalls Reports Imd
IMD: ఈ నెలలో 20 శాతం తక్కువ వర్షపాతం నమోదు
ఏటా వచ్చేదానికంటే ఈ ఏడాది త్వరగానే నైరుతీ రుతుపవనాలు దేశంలో ప్రవేశించినప్పటికీ జూన్లో వర్షాలు మాత్రం ఎప్పటిలా కురవలేదు. దీనికి సంబంధించి దిల్లీలోని భారత వాతావరణ కేంద్రం ఏమంటోందంటే..?
monsoon : వర్షాలు ఇంకా పూర్తి స్థాయిలో ఊపందుకోలేదు. చెదురుమదురుగా వర్షాలు( Rain) కురుస్తున్నప్పటికీ దేఅ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇంకా పొడి వాతావరణమే కనిపిస్తోంది. ఎండల తీవ్రత సైతం తగ్గుముఖం పట్టలేదు. ఈ విషయమై దిల్లీలోని భారత వాతావరణ కేంద్రం(IMD) కీలక ప్రకటన చేసింది. జూన్లో సాధారణం కంటే 20 శాతం తక్కువగా వర్షాలు కురిశాయని తెలిపింది. అనుకున్న ప్రకారం వర్షాలు పడలేదని వెల్లడించింది.
సాధారణంగా జూన్ ఒకటి నుంచి 18వ తేదీ లోపు 80.6 ఎంఎం వర్షపాతం(Rainfall) నమోదు కావాలి. అయితే ఈ సమయంలో ఈ ఏడాది కేవలం 64.5 ఎంఎం వర్షపాతం మాత్రమే నమోదైంది. జూన్1నే నైరుతీ రుతుపవనాలు కేరళను తాకి, తర్వాత మిగిలిన రాష్ట్రాలకూ విస్తరించాయి. అయితే అనుకున్న స్థాయిలో వర్షం మాత్రం కురవలేదు. ప్రస్తుతం నైరుతీ రుతుపవనాలు బంగాళాఖాతం, కోస్టల్ ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ఆయా చోట్ల రానున్న మూడు, నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. పిడుగులు పడే సూచనలు కనిపిస్తున్నాయి.