»Bb4 Balaiya Boyapati Big Announcement And Akhanda 2
Balaiya: BB4.. ‘బాలయ్య-బోయపాటి’ బిగ్ అనౌన్స్, మరి అఖండ 2?
పవర్ హౌజ్ కాంబినేషన్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కొత్త సినిమా అనౌన్స్ చేశారు. BB4 వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు. అయితే.. ఈ సినిమా అఖండ 2నా లేదా కొత్త ప్రాజెక్టా? అనే విషయంలో క్లారిటీ మిస్ అయింది.
BB4.. 'Balaiya-Boyapati' Big Announcement, and Akhanda 2?
Balaiya: చెప్పినట్టుగానే బాలయ్య-బోయపాటి శ్రీను నుంచి బిగ్గెస్ట్ అనౌన్స్ వచ్చేసింది. బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. సింహా, లెజెండ్, అఖండ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో.. BB4 వర్కింగ్ టైటిల్‌తో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. మాసివ్ ఎపిక్ కాంబినేనేషన్ మళ్లీ తిరిగి వచ్చేసిందంటూ ప్రకటించారు. ‘సూపర్ కాంబో మళ్లీ వచేస్తోంది. రెండు శక్తులు.. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను BB4 కోసం చేతులు కలిపారు. హ్యపీ బర్త్‌డే బాలయ్య బాబు’ అని పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించనున్నారు.
అయితే.. బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అయితే.. అఖండ తర్వాత, ఈ చిత్రానికి సీక్వెల్ రానుందని అప్పుడే అనౌన్స్ చేశారు. దీంతో.. అఖండ 2 అనౌన్స్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు BB4 అంటూ అనౌన్స్ చేశారు. దీంతో.. ఈ ప్రాజెక్ట్ అఖండ సీక్వెల్‌గా రానుందా? లేదంటే బోయపాటి కొత్త సినిమా చేస్తున్నాడా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. కానీ BB4 అనౌన్స్మెంట్ పోస్టర్ మాత్రం పవర్ ఫుల్‌గా ఉంది. పోస్టర్లో ఒక భారీ రధ చక్రం చూపించారు. దీంతో.. ఖచ్చింతగా ఈ సినిమా అఖండ 2కి మించి ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం బాలయ్య ఎన్బీకె 109 ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఆ తర్వాత BB4 సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈసారి బాలయ్యను బోయపాటి ఎలా చూపిస్తాడో చూడాలి.