బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రం అఖండ విజయాన్ని అందుకుంది. దీంతో.. అప్పుడు అఖండ 2 ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు బోయపాటి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. స్పెషల్ డే సందర్భంగా అఖండ 2 అనౌన్స్మెంట్ ఉంటుందని తెలుస్తోంది.
Akhanda 2: ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ పొలిటికల్‌గా బిజీగా ఉన్నారు. ఎలక్షన్ హడావిడి తగ్గగానే ఎన్బీకె 109 షూటింగ్ కంప్లీట్ చేయనున్నాడు బాలయ్య. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ డైరెక్ట్స్ చేస్తున్న ఈ మాస్ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే కొంత వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు.. ఎలక్షన్స్ కారణంగా చిన్న బ్రేక్ ఇచ్చారు. ఇక ఈ సినిమా తర్వాత అఖండ2 చేయడానికి రెడీ అవుతున్నారు బాలయ్య. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు బోయపాటి శ్రీను. స్కంద ఫ్లాప్ అవడంతో.. అఖండ 2 పైనే ఫోకస్ పెట్టిన బోయపాటి.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే.. ఈ సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడు? ఉంటుందనే విషయంలో క్లారిటీ లేదు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అఖండ2 అనౌన్స్మెంట్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. జూన్ 10న బాలయ్య బర్త్ డే ఉంది. ఆరోజు ఎన్బీకె 109 టైటిల్ కూడా రివీల్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. దానితో పాటు.. అఖండ 2 నుంచి అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. దీంతో ఈసారి బాలయ్య బర్త్ డేకి డబుల్ ట్రీట్ మామూలుగా ఉండదనే చెప్పాలి. ఇప్పటికే రిలీజ్ చేసిన ఎన్బీకె 109 గ్లింప్స్ అంచనాలను పెంచేసింది. ఇక టైటిల్ గ్లింప్స్ కూడా వచ్చేస్తే బాలయ్య ఫ్యాన్స్‌కు పండగే. అలాగే.. అఖండ 2 కోసం ఈగర్లీ వెయిటింగ్ అంటున్నారు కాబట్టి.. జూన్ 10న నందమూరి ఫ్యాన్స్ రచ్చ రచ్చే. ఏదేమైనా.. హ్యాట్రిక్ జోష్‌లో ఉన్న బాలయ్య.. అప్ కమింగ్ సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ కొట్టడం పక్కాగా కనిపిస్తోంది.