Akhanda: నందమూరి నటసింహం బాలకృష్ణ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్స్ జోష్‌లో.. బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నాడు. హై ఓల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్గా రిలీజ్ చేసిన గ్లింప్స్ బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంది. సింహం నక్కల మీదకు వస్తే వార్ అవదురా లఫూట్.. ఇట్స్ హంటింగ్.. అంటూ రచ్చ చేశాడు బాలయ్య. ఇక బాలయ్య కోసం తమన్ డ్యూటీ ఎక్కితే ఎలా ఉంటుందో.. గ్లింప్స్‌తోనే శాంపిల్ చూపించేశాడు. ఇక ఈ సినిమా తర్వాత అఖండ 2 స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు బాలయ్య. ఇప్పటికే బోయపాటి స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. వచ్చే నవంబర్‌లో ‘అఖండ-2’ సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. అయితే.. ఈ అవైటెడ్ కాంబినేషన్ పై ఏప్రిల్‌లో ఫుల్ క్లారిటీ రానున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఉగాదికి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే.. ఏపి ఎలక్షన్స్ కారణంగా ఎన్బీకె 109 షూటింగ్ కాస్త బ్రేక్ పడేలా ఉంది. కానీ దసరా రేసులో ఈ సినిమాను నిలబెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఎన్బీకె 109 అక్టోబర్‌లో రిలీజ్ అయితే.. నవంబర్‌లో అఖండ 2 షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ఈ ప్రాజెక్ట్‌ను గీతా ఆర్ట్స్ టేకప్ చేసినట్టుగా టాక్ నడుస్తోంది. కానీ.. బోయపాటితో అల్లు అరవింద్ చేయబోయే సినిమా అఖండ 2 అని.. ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేం. మరి అఖండ 2తో బాలయ్య, బోయపాటి ఎలా రచ్చ చేస్తారో చూడాలి.